ఎన్నికల్లో బీజేపీ డకౌట్ – కాంగ్రెస్ రన్ అవుట్ కాయం
కాంగ్రెస్ వచ్చేది లేదు – ఏ గ్యారెంటీ ఇచ్చేది లేదు
తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచింది
బిజెపి నాయకులు గద్వాల నియోజకవర్గనికి ఎం చేశారు అని ఓట్లు అడుగుతున్నారు
ప్రతిపక్షాలన్నీ ఏకమైన ప్రజల ఆశీర్వాదం ఉన్నంతవరకు శ్రీ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారి గెలుపు ఆపలేరు
కెసిఅర్ బీమా – ప్రతి ఇంటింటి ధీమా
*బిఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో పేద ప్రజలకు గొప్ప వరం
కారు గుర్తుకు ఓటేద్దాం ..
గద్వాల మరింత అభివృద్ధి చేసుకుందాం…
ధరూర్ మండలంలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన గద్వాల్ ఎమ్మెల్యే శ్రీ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సతీమణి శ్రీమతి బండ్ల జ్యోతి రెడ్డి గారు_
ఎమ్మెల్యే శ్రీ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచాలి
ఈరోజు గద్వాల నియోజకవర్గం ధరూర్ మండల పరిధిలోని పెద్దపాడు చిన్నపాడు , పాచర్ల గ్రామాలలో ఎన్నికల ప్రచారంలో భాగంగా బిఆర్ఎస్ పార్టీ అధినేత సీఎం కేసీఆర్ గారు బలపరిచిన, గద్వాల అభ్యర్థి ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారి గెలిపించాలని ఎమ్మెల్యే సతీమణి శ్రీమతి బండ్ల జ్యోతి గారు గ్రామాలలో పర్యటించి ఎన్నికల ప్రచారంలో నిర్వహించడం జరుగుతుంది.
ఎమ్మెల్యే సతీమణి గారు మాట్లాడుతూ…..
దేశంలో ఏ రాష్ట్రంలో ఇన్ని సంక్షేమ పథకాలు ఏ రాష్ట్రంలో కూడా అమలు చేయడం లేదని స్పష్టం చేశారు. కనుమరుగవుతున్న కులవృత్తులకు ప్రభుత్వం చేయూతనిచ్చిందన్నారు ఎన్నికల వేళ కాంగ్రెసోళ్లు కల్లబొల్లి మాటలు చెబుతారు, బిజెపి పార్టీ బూటకపు మాటలు చెబుతుంది వారితో అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచన ఇచ్చారు వలస వాదులను ఎమ్మెల్యేగా ఎన్నుకుంటారో స్థానిక నాయకుడు బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారిని గెలిపించుకుంటారో ప్రజలే ఆలోచించుకోవలసిందిగా కోరారు.
కొంతమంది తమ స్వార్థపు బుద్ధిని చూపించి నమ్మినవల్లను వెన్నుపోటు పొడిచారు.
అలాంటి నమ్మకద్రోహులకు వచ్చేనెల ఎన్నికల సమరంలో సరైన బుద్ధి చెప్పాలని ప్రజలకూ పిలుపునిచ్చారు.
మేనిఫెస్టోలో ఆసరా పెన్షన్లు, రైతుబంధు డబ్బుల పెంపుతో పాటు మహిళల కోసం ప్రత్యేక స్కీమ్లు ప్రకటించారాని, అర్హులైన మహిళలకు నెలనెలా జీవన భృతి అందిస్తామని, అలాగే పేద మహిళలకు రూ.400కే గ్యాస్ సిలిండర్ అందిస్తామని హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాగానే రేషన్ షాపుల ద్వారా సన్నబియ్యం అందిస్తామని హామీ ఇచ్చారు. తెల్లకార్డు కలిగి ఉన్న ప్రతి పేదఇంటికి రైతుబీమా తరహాలోనే ఎల్ఐసి ద్వారా 5 లక్షల జీవిత బీమా, ఆసరా పెన్షన్లు 5వేలకు పెంచినట్లు ఆమె తెలిపారు.
గద్వాల నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసుకోవడం కోసం బిఆర్ఎస్ పార్టీ అధినేత ఎమ్మెల్యే అభ్యర్థిగా నియమించిన శ్రీ బండ్ల క్రిష్ణ మోహన్ రెడ్డి గారిని మరోసారి ఆశీర్వదించి గెలిపించాలని ఆమె కోరారు.
👉ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ సుదర్శన్ రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు డి.ఆర్ విజయ్, మండల రైతు బంధు సమితి అధ్యక్షులు ఈశ్వరయ్య, , మండల సర్పంచ్లు సంఘం అధ్యక్షులు రఘువరన్ రెడ్డి, ,వివిధ గ్రామాల సర్పంచులు విజయభాస్కర్ , ఆంజనేయులు, సవరమ్మ ఎంపీటీసీలు, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు నాగర్ దొడ్డి వెంకట్ రాములు, శ్రీనివాస్ రెడ్డి, వెంకటేశ్వర్ రెడ్డి, సర్వారెడ్డి, ప్రభాకర్ గౌడ్ , సురేందర్ రెడ్డి, భీమ్ రెడ్డి, డి.ఆర్ శ్రీధర్, విజయ రెడ్డి, శంకర్ రెడ్డి, మహేందర్ రెడ్డి హనుమంతు రెడ్డి, మల్లికార్జున్ రెడ్డి, రంగస్వామి, రాఘవేందర్ రెడ్డి, రఘునాథ్ రెడ్డి, ఆనంద్ రెడ్డి, ఈశ్వర్, మహిళా నాయకురాలు రాధా, రాధమ్మ, జిల్లా మహిళా సమైక్య అధ్యక్షురాలు సంగీత బిఆర్ఎస్ పార్టీ మండల యూత్ అధ్యక్షుడు చిట్టెం పురుషోత్తం రెడ్డి, ప్రధాన కార్యదర్శి సంజీవ్, ఉపాధ్యక్షులు జాంపల్లి భరత సింహారెడ్డి, నాయకులు కార్యకర్తలు యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.