సీసీఎల్ఏ లో ఫిర్యాదు చేసిన బాధితులు
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని నాగారం పరిధిలో భూదాన్ భూముల అక్రమ బదలాయింపు వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలని బాధితులు సీసీఎల్ఏ లో అధికారులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుత మహేశ్వరం ఎమ్మార్వో మహమూద్ అలీ అక్రమ పద్ధతుల ద్వారా 50 ఎకరాల భూదాన్ భూములను ఈఐపిఎల్ సంస్థకు అక్రమంగా బదిలీ చేశారని ఆరోపిస్తూ దస్తగిరి షరీఫ్ అనే వ్యక్తి సీసీఎల్ఏ లో అధికారులకు. మహేశ్వరం మండలం నాగారం పరిధిలోని సర్వేనెంబర్ 181 లో గల 50 ఎకరాల భూదాన్ భూములను ప్రస్తుత ఎమ్మార్వో మహబూబ్ అలీ ఈఐపీఎల్ అనే సంస్థకు అక్రమంగా బదిలీ చేశారని ఆయన అధికారులకు ఫిర్యాదు చేశారు. గతంలో ఇదే సర్వే నెంబర్ లో 42 ఎకరాల నిషేధిత ప్రభుత్వ భూములను ఈఐపిఎల్ సంస్థకు అప్పటి మహేశ్వరం ఎమ్మార్వో జ్యోతి అక్రమంగా బదిలీ చేశారని ఆరోపిస్తూ బాధితుడు ఇప్పటికే న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ వ్యవహారంపై కేంద్ర దర్యాప్తు సంస్థలు విచారణ సాగిస్తున్న తరుణంలో తాజాగా ఇదే సర్వే నంబర్ లోనే 50 ఎకరాల భూదాన్ భూములను ప్రస్తుత ఎమ్మార్వో ఈ ఐ పి ఎల్ సంస్థకు బదిలీ చేయడం కలకలం రేపింది. ఈ వ్యవహారం పై సమగ్ర విచారణ జరిపించాలని కోరుతూ దస్తగిరి షరీఫ్ సీసీఎల్ఏ లో అధికారులకు ఫిర్యాదు చేశారు.