రేపు రామాయంపేటకు రాష్ట్ర మంత్రి వర్యులు తన్నీరు హరీష్ రావు రాకమెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో రేపు సోమవారం రాష్ట్ర మంత్రి తన్నీరు హరీష్ రావు, స్థానిక మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి పర్యటించన్నున్నారు. ఉమ్మడి నిజాంపేట మండలంలోబిఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభోత్సవం చేస్తారు. రామాయంపేట మండల కేంద్రంలో రెవెన్యూ డివిజన్ కార్యాలయం డిగ్రీ కళాశాల, మున్సిపల్ భవనానికి శంకుస్థాపన చేస్తారు.45 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపనలు చేయనున్నారు.