నిజామాబాద్ జిల్లా.రెంజల్ మండలం వీరన్న గుట్ట గ్రామంలోని బీసీ కాలనీ లో జడ్పిటిసి మేక విజయ సంతోష్, సర్పంచ్ బైండ్ల రాజు, ఎంపీటీసీ గంగలత భూమేష్, సీసీ రోడ్డును ప్రారంభించారు. పార్లమెంటు సభ్యుల నిధుల నుంచి నాలుగు లక్షల రూపాయలు మంజూరు కాగా అట్టి నిధులతో పనులు ప్రారంభించినట్లు జడ్పిటిసి మేక విజయ సంతోష్ పేర్కొన్నారు. సదర్ కాంట్రాక్టర్ నాణ్యతతో కూడిన పనులు చేయాలని ఆమె సూచించారు. తమ మండలానికి నిధులు మంజూరు చేసిన ఎంపీ ధర్మపురి అరవింద్ కు ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పైన రాజు, ఎంపీటీసీ గంగాలత భూమేష్, పాలకవర్గ సభ్యుడు శ్రీకాంత్, గ్రామ పెద్దలు మిద్దె శంకర్ గౌడ్ , సాయిబాబా, నర్సింలు తదితరులు పాల్గొన్నారు.