మహానంది పుణ్యక్షేత్రంలో వెలసిన శ్రీ కామేశ్వరి దేవి సహిత మహానందీశ్వర స్వామి వార్లను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాజశేఖర్ రావు దంపతులు శుక్రవారం రాత్రి దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. వీరికి ఆలయ ఈవో కాపు చంద్రశేఖర్ రెడ్డి, ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. స్వామి అమ్మవార్లకు అభిషేకం, కుంకుమార్చన తదితర పూజలు నిర్వహించుకున్నారు.పూజల అనంతరం ఆలయ ఈవో శేష వస్త్రాలతో సత్కరించి, స్వామి వారి జ్ఞాపికను అందజేయగా,వేద పండితులు వేద ఆశీర్వచనాలు చేసి, తీర్థ ప్రసాదాలు అందజేశారు.