మహానంద్వీశ్వరుని హుండీ ఆదాయం రూ33,43 లక్షలు
స్టూడియో 10 టీవీ న్యూస్, సెప్టెంబర్ 29, మహానంది:
మహానంది క్షేత్రంలో శుక్రవారం హుండీ లెక్కింపు నిర్వహించగా దేవస్థానానికి రూ.33,43,697 లక్షల ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో కాపు చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. ప్రధాన ఆలయాల్లో భక్తులు 40 రోజులపాటు సమర్పించిన హుండీ కానుకలను ఆలయ ప్రాంగణంలోని అభిషేక మండపంలో సిబ్బందితో లెక్కించామన్నారు. ఇందులో స్వామి, అమ్మవారి ఆలయాలలోని హుండీలతోపాటు ఇతర హుండీలను లెక్కింపు నిర్వహించగా రూ.33,43,697 లక్షలు వచ్చిందని అన్నారు.ఆలయాల ద్వారా 32,47,659వేలు,అన్నదానం హుండీ ద్వారా రూ.77,254 వేలు,గోసంరక్షణ రూ.18,784 వేలు,జర్మనీ కరెన్సీ 5 యూరో -1,యూఏఐ సెంట్రల్ బ్యాంక్ 5 దిరమ్స్-1,వచ్చినట్లు ఈవో పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖా తరుపున
టి .చక్ర భారత్, ధర్మకర్త మండలి సభ్యులు గంగిశెట్టి మల్లికార్జున, పి వీరభద్రుడు, వివిధ సేవా సంస్థల సభ్యులు, దేవస్థానం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.