*ప్రజలంతా జగనన్నపై అమృత వర్షం కురిపిస్తున్నారు – ఎమ్మెల్యే భూమన*
తిరుపతి( స్టూడియో 10 న్యూస్ )
ప్రజలంతా నిండు మనస్సుతో ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డిపై అమృత వర్షం కురిపిస్తున్నారని తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర రెడ్డి అన్నారు. గడప గడపకు మనప్రభుత్వం కార్యక్రమంలో భాగంగ శనివారం తిరుపతి 21వ డివిజన్లో తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా మీడియాతో భూమన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ప్రతిపక్ష నేత చంద్రబాబు, పవన్ కల్యాణ్ పనిగట్టుకుని విషం చిమ్ముతుంటే, ప్రజలంతా తమ నిండు మనస్సుతో జగనన్నపై అమృత వర్షం కురిపిస్తున్నారని సంతోషం వ్యక్త పరిచారు. రాష్ట్రంలో వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న మంచికి, ఆయన చేస్తున్న సంక్షేమ, అభివృద్ధికే తామంతా ఓటు వేస్తామని ప్రజలందరూ ముక్తకంఠంతో చెబుతున్నారని, జగనన్నకు ఓటు వేసి ప్రతిపక్షాలను ఓటుతో చావు దెబ్బ తీసి, గుణపాఠం చెప్తామని ప్రజలు గట్టిగా చెబుతున్నారని ఆయన వివరించారు. వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద అక్కసు, శత్రుత్వం తప్ప ప్రతిపక్షాలకు ఇంకొక పని లేదని, ప్రజలు స్పష్టమైన అభిప్రాయంతో ఉన్నారని ఎమ్మెల్యే తెలిపారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండి ప్రజలను వంచించి నాడని, పవన్ కళ్యాణ్ ఎక్కడ పోటీ చేసినా గెలిచేదీ కూడా లేదు కాబట్టి వీళ్ల మాటలు నమ్మి జగనన్నను పోగొట్టుకోవడానికి సిద్ధంగా లేమని ప్రజలు స్వయంగా చెబుతున్నారన్నారు. జగనన్నకు ఓటు వేస్తేనే తమకు ఉజ్వల భవిష్యత్ ఉంటుందని ప్రజలు ఎప్పుడో నిర్ణయించుకున్నారని, ఈ రోజు తమ పిల్లలు ఇంత గొప్పగా చదువు కోగలుగుతున్నారని, ఇంత మంచి పుస్తకాలు వస్తాయని ఊహించలేదంటూ తమ సంతోషాన్ని వ్యక్యం చేస్తున్నారని భూమన కరుణాకర రెడ్డి తెలిపారు. ముఖ్యంగా బైజూస్ నుంచి వాళ్ల పాఠ్యాంశాలుగా ట్యాబ్ లు ఇస్తారని కలలో కూడా అనుకోలేదని పిల్లల తల్లిదండ్రులు ఆనందాన్ని తెలియజేస్తున్నారని, ప్రభుత్వ మున్సిపల్ పాఠశాలలన్నీ కూడా ఇప్పుడు ఎంత గొప్పగా ఉన్నాయంటే తామే ఊహించలేమని, తమకందరికీ ఇల్లు వచ్చిందని, ఆసరా, చేయూత, చేదోడు, కాపు నేస్తం ఇలా అన్నీ ఇస్తున్న జగనన్న కాకుండా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కి ఎందుకు ఓట్లు వేస్తామని ప్రజలే ప్రశ్నిస్తున్నారని భూమన కరుణాకర రెడ్డి పేర్కొన్నారు. గడప గడపకు కార్యక్రమంలో కార్పొరేటర్ ఈశ్వరీ, దొడ్డారెడ్డి సిద్దారెడ్డి, పాలగిరి ప్రతాప్ రెడ్డి, నాయకులు అనీల్, పడమటి కుమార్, డిష్ చంధ్ర, మనోహర్ రెడ్డి, మబ్బు నాధమునిరెడ్డి, బ్రహ్మానంధ రెడ్డి, మకం చంధ్ర, నాధముని, జీవన్, మునిబాబు, దేవధానం, తాళ్ళూరి ప్రసాద్, శ్యామల తదితరులు పాల్గొన్నారు.