దామరగిద్ద కురుమ సంఘం అధ్యక్షులుగా దొడ్డి రామ్.

చేవెళ్ల జూన్ 23( జనం వార్త ): చేవెళ్ల మండలంలోని దామరగిద్ద గ్రామంలో కురుమ సంఘం సమావేశాన్ని నిర్వహించి గ్రామ కమిటీని ఎన్నుకున్నారు.గ్రామ అధ్యక్షులుగా దొడ్డి రామ్, ఉపాధ్యక్షులుగా మన్నెగూడం శ్రీశైలంను, జనరల్ సెక్రెటరీగా చిలుకూరు సత్తయ్య, జాయింట్ సెక్రటరీగా అక్నాపురం నర్సింలు, కోశాధికారిగా గణపురం సత్తయ్య ను నియమించినట్లు మండల కురుమ సంఘం అధ్యక్షులు వెంకటేష్ తెలిపారు.ఈ సందర్భంగా నూతనంగా ఎన్నుకున్న గ్రామ కమిటీ సభ్యులకు నియామక పత్రాన్నిఅందజేశారు.ఈ సందర్బంగా ఎన్నికైన వారు మాట్లాడుతూ… కురుమ సంఘం బలోపేతానికి తమ వంతు కృషి చేస్తానన్నారు. తమపై నమ్మకంతో ఈ అవకాశం కల్పించిన మండల అధ్యక్షునికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కుమార్ దండు సత్తి,మహేందర్ నర్సింలు, వెంకటేశం, గోపాల్, పత్తి సత్యనారాయణ, శ్రీనివాస్ సత్తయ్య,మల్లేష్,కుమార్ గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

Avatar
STUDIO10TV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!