పోలీస్ కానిస్టేబుల్,ఎస్సై సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ కు 522 మంది అభ్యర్థులకు గాను 471 మంది అభ్యర్ధులు హజరు
👉ఈ నెల 24 వ తేది వరకు మాత్రమే అభ్యర్థుల సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ కు అనుమతి అభ్యర్థులు గమనించగలరు… ——– జిల్లా ఎస్పీ శ్రీమతి కె. సృజన
జోగుళాంబ గద్వాల్ జిల్లా, వనపర్తి జిల్లాల నుండి ఎస్సై మరియు కానిస్టేబుల్ ఉద్యోగాల కొరకు ఎంపిక అయిన అభ్యర్థులకు వెరిఫికేషన్ ప్రక్రియ ఈ రోజు 522 మందికి గాను 471 మంది అభ్యర్థులు హాజరయ్యారని ఈ వెరిఫికేషన్ ప్రక్రియ ఈ నెల 24 వ తేది వరకు కొనసాగుతుందనీ ఈ విషయాన్ని అభ్యర్థులు గమనించాలని జిల్లా ఎస్పీ శ్రీమతి కె. సృజన గారు తెలిపారు. అనుమతి లేని గైర్హాజరు అయిన వారి విషయంలో బోర్డ్ అనుమతి తో మాత్రమే పరిశీలించడం జరుగుతుంది. సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ ఈ నెల 24 వ తేది వరకు మాత్రమే ఉంటుందని తరువాత అనుమతించబడదని, ఈ విషయాన్ని అభ్యర్థులు గ్రహించాలని జిల్లా ఎస్పీ గారు తెలిపారు. అభ్యర్థులు తమ ఒరిజనల్ విద్యా ధృవీకరణ పత్రాలు తీసుకోని ఉదయము 09: 00గంటలు లోపు జిల్లా పోలీస్ కార్యాలయం లో రిపోర్ట్ చేయాలని జిల్లా ఎస్పీ గారు సూచించారు. ఈ పరిశీలన కార్యక్రమములో ఏ. ఓ సతీశ్ కుమార్ గారు, సాయుధ దళ డి. ఎస్పీ శ్రీ ఇమ్మనియోల్ గారు, సుపెరిండెంట్స్ నయీం గారు, ఐటీ సెల్ ఎస్సై రజిత గారు పాటు పరిపాలన విభాగం అధికారులు, సిబ్బంది పాల్గోన్నారు.