*స్వర్గీయ జస్టిస్ కొండా మాధవ రెడ్డి గారి శత జయంతి ఉత్సవాల సందర్భంగా నిర్వహిస్తున్న భజన మండలి పోటీలు ప్రారంభం*
మన పల్లెల్లో ఆధ్యాత్మిక, భక్తి భావనను మరింత పెంపొందించడానికి భజనలు ఎంతో ఉపయోగపడుతాయని, జస్టిస్ కొండా మాధవ రెడ్డి గారి శత జయంతి ఉత్సవాలను నిర్వహణ లో భాగంగా భజన మండలి పోటీలు నిర్వహించుతున్నాము. దానిలో భాగంగా ప్రారంభ కార్యక్రమం మరియు మొదటి పోటీ అక్నాపూర్ గ్రామంలో జరిగింది.
భజన మండలి పోటీల నిర్వహణ కమిటి ఆధ్వర్యంలో జరుగుతున్న పోటీలకు ఇప్పటికి దాదాపు 100 భజన బృందాలు వివిధ గ్రామాల నుండి పాల్గొనటానికి ఆసక్తి చూపి ముందుకు వచ్చాయి. ఈరోజు ప్రారంభ కార్యక్రమం తరువాత జరుగు మొదటి పోటీలో… అక్నాపూర్, చించల్ పేట్, ముబారక్ పూర్, పూలపల్లి, అత్తాపూర్ గ్రామాల నుండి భజన బృందాలు పాల్గొంటాయి. ఇట్టి మంచి కార్యక్రమంలో మీరు కూడా మీ గ్రామ భజన మండలి తరుపున పాల్గొనాలని అనుకుంటే కింద తెలిపిన నెంబర్లను సంప్రదించండి.
ముఖ్య అతిథులుగా:
అక్నాపూర్ గ్రామ ఎం.పి.టి.సి. బందయ్య గౌడ్ గారు,
చేవెళ్ల మాజీ ఎం.పి. కొండా విశ్వేశ్వర్ రెడ్డి గారు,
కొండా లక్ష్మీకాంత్ రెడ్డి గారు, రామదేవ్ గారు, ఉప సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్ గారు పాల్గొన్నారు.
న్యాయ నిర్ణేతలుగా రఘు పంతులు, విశ్వనాథం గారు,
భజన మండలి పోటీల నిర్వహణ కమిటి
జస్టిస్ కొండా మాధవ రెడ్డి ఫౌండేషన్
ప్రోగ్రెసివ్ తెలంగాణ ఫౌండేషన్
దరఖాస్తు చేసుకోవడం కొరకు వివరాలకు: +918106029444, +918341253032