*మహా కుంభాభిషేకం పునః ప్రతిష్టతతో గంగమ్మ దర్శనం శుభకరం*
*కంచి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ విజేయేంద్ర సరస్వతి*
*విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి*
*భక్తులకు కన్నుల పండుగ గంగమ్మ దర్శనం : ఎమ్మెల్యే భూమన*
*తిరుపతి*
*తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ తల్లి కుంభాభిషేకంలో భాగంగ అమ్మవారి పునః ప్రతిష్టతతో భక్తులకు అమ్మవారి దర్శనం శుభకరమని కంచి కామకోటి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ విజయేంధ్ర సరస్వతి స్వామి, విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి అన్నారు. అమ్మవారి దర్శనం భక్తులకు కన్నుల పండుగగా వుందని తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర రెడ్డి అన్నారు. తిరుపతి శ్రీ తాతయ్య గుంట గంగమ్మ తల్లి విగ్రహ పున: ప్రతిష్ట మహా కుంభాబిషేకం కార్యక్రమంలో భాగంగా శుక్రవారం శ్రీ తాతయ్య గుంట గంగమ్మ ఆలయంకు చేరుకున్న కంచి కామకోటి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ విజేయేంద్ర సరస్వతి స్వామి వారికి తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్.కె.రోజా ఆలయ మర్యాదలతో సాంప్రదాయ బద్దంగా స్వాగతం పలికారు. పీఠాధిపతి ముందుగా యజ్ఞ శాలలో నిర్వహించే హోమం కార్యక్రమంలో పాల్గొని పూజలు నిర్వహించి, గర్భాలయంలో గంగమ్మ తల్లి విగ్రహ పున: ప్రతిష్ట చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గర్భాలయం శిఖర కలశ ప్రతిష్ట మహాకుంభ సమర్పణ కార్యక్రమాలు నిర్వహించారు. అదేవిధంగా విశాఖ శారద పీఠాధిపతి స్వరూపనందేంద్ర స్వామి ఆలయంలో అమ్మవారి దర్శనంలో పాల్గొన్న అనంతరం మాట్లాడుతూ ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డిని అమ్మవారి పునః ప్రతిష్టత కోసం శ్రమించినందుకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ డాక్టర్ శిరీష, ఉప మేయర్ భూమన అభినయ రెడ్డి, ఆలయ ఛైర్మన్ కట్టా గోపి యాదవ్, ఈఓ మునికృష్ణ, ధర్మకర్తల మండలి సభ్యులు, స్థానిక భక్తులు తదితరులు పాల్గొన్నారు.*