జువేధ బేగం కు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ అందజేస్తున్న జిల్లా పరిషత్ చైర్పర్సన్ సునీత రెడ్డి Rs.30,000/- చెక్కు దృశ్యం
సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు ఎంతో భరోసా జిల్లా పరిషత్ చైర్పర్సన్ సునీత రెడ్డి
వికారాబాద్: సీఎం రిలీఫ్ ఫండ్ సామాన్య ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ పట్నం సునీత మహేందర్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం హైదరాబాద్ లోని తన నివాసంలో దారురు మండలం దోర్నాల గ్రామానికి చెందిన జుబేదాబేగంకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును వడ్ల నందు ఫౌండేషన్ చైర్మన్ వడ్ల నందు నర్సాపూర్ వార్డ్ సభ్యులు ప్రకాష్ తో కలిసి ఆమె అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సామాన్య ప్రజలకు సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని గతంలో ఏ ప్రభుత్వం చేపట్టిన విధంగా తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో ముందుకు సాగుతుందని తెలిపారు రాబోయే రోజుల్లో మరింత ప్రయోజనకరరముగా సీఎం రిలీఫ్ ఫండ్ ఉంటుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.