ప్రపంచ మలేరియా దినోత్సవం ర్యాలీ
స్టూడియో 10 టీవీ న్యూస్, ఏప్రిల్ 25, మహానంది:
మహానంది మండలం గాజులపల్లె గ్రామంలో
ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా మంగళవారం ప్రాథమిక ఆరోగ్య వైద్య సిబ్బంది ర్యాలీ చేపట్టారు.స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద డాక్టర్ శ్రీనివాసులు,డాక్టర్ వెంకటరెడ్డి ఆధ్వర్యంలోని పిహెచ్సీ సిబ్బంది, ఏ.ఎన్.ఎం.లు, ఆశా కార్యకర్తలందరూ ర్యాలీ గా వెళ్లి దోమల నివారణ చర్యలపై ప్రజలకు అవగాహనను కల్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ మలేరియా నిర్మూలన ప్రజలు ముందు జాగ్రత్తలు పాటిస్తే దానిని నిర్మూలించవచ్చని తెలియజేశారు. మలేరియా ఇదొక ప్రాణాంతక జ్వరము ఆడ అనాఫలిస్ దోమకాటుతో ఈ జ్వరం సోకుతుందని తెలిపారు, ప్రజలు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటేనే మలేరియా జ్వరము దరిచేరదన్నారు.
మలేరియా వచ్చినప్పుడు లక్షణాలు చలితో వణుకుతో విపరీతమైన జ్వరం వస్తుందని, తలనొప్పి ,ఒళ్ళు నొప్పులు ఉంటాయన్నారు రోజు మార్చి రోజు జ్వరం రావడము, వాంతులు రావడం జరుగుతుందని ప్రజలకు ఈ లక్షణాలు ఏమైనా ఉంటే వెంటనే ప్రభుత్వ ఆసుపత్రిలో రక్తపరీక్ష చేయించుకోవడం ద్వారా వ్యాధి నిర్ధారణ తెలుసుకోవచ్చు అన్నారు, పై సూచనలు సలహాలు పాటిస్తే ఈ వ్యాధి నుండి రక్షణ పొందుతారని వారు ప్రజలకు అవగాహన కల్పించారు.