రంజాన్ గిఫ్ట్ ప్యాక్లా పంపిణీ కార్యక్రమంలో ప్రోటోకాల్ పంచాయితీ..
అధికారిక కార్యక్రమంలో మున్సిపల్ ప్రథమ పౌరురాలు చైర్ పర్సన్ ఫోటో లేకుండా ఫ్లెక్సీ ఎలా వేస్తారు అంటూ గొడవ..
ఎమ్మెల్యే ముందు కింద కూర్చొని నిరసన వ్యక్తం చేసిన ప్రజా ప్రతినిధులు..
మౌనం వహించిన ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్..
రాజకీయాల్లో తల దురుస్తున్న అధికారులు..!
కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తాం అన్నా చైర్ పర్సన్ మంజుల
అధికారుల తప్పిదం రాజకీయ రగడకు దారితీసిందా..?
ప్రభుత్వ కార్యక్రమంలో ప్రవేట్ వ్యక్తుల హల్చల్..
వికారాబాద్ జిల్లా కేంద్రంలో శనివారం అధికారికంగా నిర్వహించిన రంజాన్ గిఫ్ట్ ప్యాక్లా పంపిణీ కార్యక్రమంలో ప్రోటోకాల్ పాటించని సంఘటన కలకలం రేపింది. అధికారికంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో వికారాబాద్ మున్సిపల్ ప్రథమ పౌరురాలు అయిన చైర్ పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్ తో పాటు, మండల ఎంపీపీ చంద్రకళ, చివరికి మైనార్టీ నాయకురాలు మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ శంషాద్ బేగం, స్థానిక కౌన్సిలర్ పైమీద బేగం నలుగురి ఫోటోలు లేకపోవడంతో ఎమ్మార్వో వహేదా కాతూమ్ తీరుపై చైర్ పర్సన్ మంజుల రమేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ ఆనంద్ రాగానే నలుగురు మహిళా ప్రజా ప్రతినిధులు కింద కూర్చుని నిరసన వ్యక్తం చేశారు. మహిళా ప్రజా ప్రతినిధులను అవమానించేలా ఫ్లెక్సీలు వేయడం ఏంటని, ప్రోటోకాల్ పాటించినప్పుడు మమ్మల్ని ఎందుకు పిలిచారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయాలు ఏమైనా ఉంటే మేము చూసుకుంటామని, అంత ధైర్యం మాకు ఉందని, అధికారులు మీ పరిధిలో ఉండాలని ఎమ్మార్వోను హెచ్చరించారు. ఎమ్మార్వో తీరుపై కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తామని చైర్ పర్సన్ మంజుల రమేష్ తెలిపారు.
ప్రభుత్వ కార్యక్రమంలో ప్రవేట్ వ్యక్తుల హల్చల్..!
ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న రంజాన్ గిఫ్ట్ ప్యాక్లా పంపిణీ కార్యక్రమంలో ప్రోటోకాల్ ప్రకారమే ప్రజా ప్రతినిధులు స్టేజ్ పైకి వెళ్లాల్సి ఉంటుంది. అలాంటిది ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అనుచరులం అని చెప్పి లక్ష్మికాంత్ రెడ్డి లాంటి కొందరు బిఆర్ఎస్ పార్టీకి చెందిన ప్రవేట్ వ్యక్తులు స్టేజ్ ఎక్కి ఏకంగా ఎమ్మెల్యే పక్కనే కూర్చొని హల్చల్ చేయడం పట్ల చైర్ పర్సన్ మంజుల అసహనం వ్యక్తం చేశారు. చైర్ పర్సన్ ను అవమానించి సంబంధం లేని వ్యక్తులను అధికారులు స్టేజ్ పైకి ఎలా పిలుస్తారని నిలదీశారు. దాంతో అధికారులు మేము పిలవలేదని చెప్పడంతో పిలవనప్పుడు స్టేజ్ పైకి ఎలా వచ్చారని ప్రశ్నించారు. దాంతో మారింది గందరగోళంగా మారింది.
ఫ్లెక్సీ తీసేసి కార్యక్రమం కొనసాగింపు..
ప్రోటోకాల్ ఇష్యూతో గొడవ జరగడంతో స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ఆదేశాల మేరకు ఫ్లెక్సీ తీసివేసి కార్యక్రమం ప్రారంభించారు. ఈ కార్యక్రమం చివరి వరకు ఒకే పార్టీలో రెండు వర్గాలుగా చర్చలు నడిచాయి. మైక్ తీసుకున్న చైర్ పర్సన్ ప్రశ్నించే సమయం వస్తే కచ్చితంగా ప్రశ్నిస్తామని ఎవరికీ భయపడేది లేదని అన్నారు. ఇదిలా ఉంటే కార్యక్రమం చివర్లో ప్రజాప్రతినిధులు అందరు కలిసి రంజాన్ గిఫ్టులు పంపిణీ చేయాల్సి ఉండగా, ఎమ్మెల్యే ఆనంద్ ఒక గిఫ్ట్ పంపిణీ చేయగా, చైర్ పర్సన్ ఇతర మహిళా ప్రజా ప్రతినిధులు మరో గిఫ్ట్ పంపిణీ చేస్తూ కార్యక్రమాన్ని గందరగోళానికి గురి చేశారు. ఈ కార్యక్రమంతో వికారాబాద్ బిఆర్ఎస్ లో వర్గ పోరు మరింత తారస్థాయికి చేరిందని చర్చ నడుస్తుంది. చైర్ పర్సన్ మంజుల రమేష్ ఎప్పుడు లేని విధంగా ఆగ్రహానికి గురి కావడంతో, చివరికి ఎమ్మెల్యే ఆనంద్ సైతం మౌనం పాటించారు. ఇలాంటివి మరోసారి రిపీట్ అయితే బాగుండదని ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్, ఎమ్మార్వోను హెచ్చరించారు. ఇదిలాఉంటే ఎమ్మెల్యే డాక్టర్ ఆనంద్ తీరుపై సొంత పార్టీ అసమ్మతి నాయకులే సెటైర్లు వేస్తున్నారు. ప్రొటొకాల్ తప్పిదం బయటకి కనిపిస్తున్నట్లు ఎమ్మెరో తప్పు కాదని, ఎమ్మెల్యేకు తెలియకుండా ప్లెక్సీ ఎలా బయటకు వస్తుంది. నిజానికి ఎమ్మెల్యే కేవలం ఎమ్మెల్యే మాత్రమే కాదు, ఆయనే మున్సిపల్ ఛైర్మెన్, వైస్ ఛైర్మెన్, కౌన్సిలర్, జడ్పిటిసి, గ్రామ సర్పంచ్, ఎంపీటిసి, చివరికి వార్డు మెంబరు కూడా ఆయనే అనుకుంటున్నాడని, అందుకే వార్డు మెంబర్ చేసే పనికూడా ఆయనే చేస్తూ అనేక సార్లు అవమానాలకు గురవుతున్న అయన తీరుసలో మార్పు రావడం లేదని సెటైర్లు వేస్తున్న పరిస్థితి. మరి ఈ వర్గపోరుపై అధిష్టానం ఏం నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.