భిన్న సంస్కృత విభిన్న భాషల ఉన్నప్పటికీ మన దేశ అభివృద్ధికి మంచి రాజ్యాంగాన్ని అందించిన గొప్ప నాయకుడు బాబాసాహెబ్ అంబేద్కర్ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి

భిన్న సంస్కృతులు, విభిన్న భాషలు ఉన్నప్పటికీ మన దేశ అభివృద్ధికి మంచి రాజ్యాంగాన్ని అందించిన మహా నాయకుడు బాబాసాహెబ్ అంబేద్కర్ అని జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి కొనియాడారు.
డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 132వ జయంతిని పురస్కరించుకొని రైల్వే స్టేషన్ దగ్గర ఏర్పాటుచేసిన జయంతి ఉత్సవాల సందర్భంగా బీసీ కమిషన్ సభ్యులు శుభప్రద్ పటేల్, జడ్పీ వైస్ చైర్మన్ విజయ్ కుమార్, మున్సిపల్ చైర్ పర్సన్ చిగురాలపల్లి మంజుల రమేష్ లతో పాటు జిల్లా కలెక్టర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో కలెక్టర్ మాట్లాడుతూ.. సమాజంలో సమాన అవకాశాలు, అభివృద్ధికి మన రాజ్యాంగం ఎంతో దోహదపడుతుందని అన్నారు. విద్యావంతులు తమ వంతు కర్తవ్యాన్ని నిర్వహిస్తూ సమాజంలో మార్పు కోసం పాటు పడాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 10 లక్ష రూపాయల నుండి కోటి రూపాయల వరకు సబ్సిడీ లేని రుణాలు పొందేందుకు అవకాశం ఇచ్చిందని వీటిని సద్విని చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. అదేవిధంగా పోటీ పరీక్షలకు తర్ఫీదు ఇచ్చి ఉద్యోగాలు వచ్చే విధంగా ఉచిత శిక్షణ ఇవ్వడం జరుగుతుందని దీనివల్ల నిరుద్యోగులు ఉద్యోగాలు సంపాదించడంతో కుటుంబాలు బాగుపడతాయని ఆయన అన్నారు ‌. వ్యవసాయ రంగంలో ఉద్యానవన పంటలతో పాటు అనుబంధ రంగాల్లో రాణించేందుకు ముందుకు రావాలని కలెక్టర్ కోరారు. జిల్లా అభివృద్ధికి కలిసికట్టుగా చేయి చేయి అందుకొని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అన్నారు.

బీసీ కమిషన్ సభ్యులు శుభప్రద్ పటేల్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి కృషిచేసిన ముద్దుబిడ్డ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి బాబాసాహెబ్ అంబేడ్కర్ అని అన్నారు. బాబాసాహెబ్ రాజ్యాంగాన్ని రాసి దేశానికి అంకితం చేసి ఆయన కొంతమందికి పరిమితం కాకుండా అందరికీ ఆదర్శ ప్రాయంగా నిలిచారని అన్నారు. సమాజం మనం మారుతూనే సమాజ మార్పు కోసం కృషి చేయాలని ఆయన తెలిపారు. చదువు వల్లనే ప్రతి ఒక్కటి సాధ్యమని భావించిన రాష్ట్ర ప్రభుత్వం వెయ్యి గురుకుల పాఠశాలను స్థాపించి విద్యాభివృద్ధికి కృషి చేస్తుందని ఆయన అన్నారు. మహనీయులు ఎంతోమంది పీడిత ప్రజల కోసం పనిచేశారని వారి అడుగుజాడల్లో ప్రతి ఒక్కరు నడవాలని ఆయన కోరారు.

జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ విజయ్ కుమార్ మాట్లాడుతూ బాబా సాహెబ్ సమాజంలో సమానత్వ కోసం కృషి చేసిన మహనీయులని ఆయన అన్నారు. న్యాయ శాఖ మంత్రిగా కొనసాగుతూ మహిళల హక్కుల కోసం ప్రవేశపెట్టిన హిందూ కోడ్ బిల్లును ఆమోదించకపోవడంతో మంత్రి పదవిని కూడా లెక్కచేయకుండా రాజీనామా చేసిన మహోన్నతుడని ఆయన అని అన్నారు.

మున్సిపల్ చైర్ పర్సన్ మాట్లాడుతూ స్వాతంత్రం సిద్ధించి 76 సంవత్సరాలు అయినప్పటికీ దేశం ఒకే తాటిపై ఉండడం రాజ్యాంగ గొప్పతనం అని అన్నారు. అంబేద్కర్ అందరికీ సమాన హక్కులు,ఓటు హక్కును కల్పించడంతోపాటు ఆర్థిక స్వేచ్ఛ, మహిళలకు రాజకీయ అవకాశం కల్పించాలని ఆకాంక్షించిన ఆదర్శనీయుడని ఆమె కొనియాడారు.
అంతకుముందు ఆలంపల్లి చౌరస్తా నుండి అంబేద్కర్ చిత్రపటంతో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఉత్సవాల కమిటీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీని నిర్వహించారు.
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా స్థానిక శాసనసభ్యులు డాక్టర్ మెతుకు ఆనంద్, మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్, జయంతి, మున్సిపల్ కౌన్సిలర్ సురేష్, ఉత్సవాల కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు జగదీష్, నర్సింలు, దళిత సంఘాల నాయకులు అనంతయ్య, భీమయ్య, దేవదాస్ , పెండ్యాల అనంతయ్య , అడ్వకేట్ ఆనంద్, రామచంద్రయ్య, మల్లేష్ లతో పాటు ఉత్సవ కమిటీ కార్యవర్గ సభ్యులు, నాయకులు రత్నారెడ్డి, కిషన్ నాయక్, జిల్లా
డిఎస్సిడబ్ల్యూఓ మల్లేష్,
డిబిసిడబ్ల్యూఓ ఉపేందర్, అడిషనల్ ఎస్పీ మురళీధర్, వికారాబాద్ ఆర్డిఓ విజయ్ కుమారి, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, దళిత సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని అంబేద్కర్ కు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. తెలంగాణ సాంస్కృతి సారుదుల ఆట పాటలతో ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

Avatar
STUDIO10TV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!