జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సమావేశం..
పాల్గొన్న మండల ఎంపీపీ,విజయ్ కుమార్..
వికారాబాద్ జిల్లా..
దౌల్తాబాద్: జూనియర్ పంచాయితీ కార్యదర్శుల 4 సంవత్సరాల పదవీ కాలం ప్రొబేషనరి పీరియడ్,పూర్తి అయిన సందర్భంగా జూనియర్ పంచాయితీ కార్యదర్శులను ప్రభుత్వం పర్మనెంట్,(క్రమబద్దీకరణ) చేయాలని కోరుతూ నేడు దౌల్తాబాద్ మండల కేంద్రంలో స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో జేపీ ప్రొబేషనరి పీరియడ్ నిర్వహణ కార్యక్రమం చేపట్టారు. జూనియర్ పంచాయితీ కార్యదర్శుల పదవీకాలం 4 సంవత్సరాలు పూర్తయినా సందర్భంగా మండల జెపి కార్యదర్శుల సంగం అధ్యక్షులు అశోక్,వైస్ ప్రెసిడెంట్, ఆనందం,ప్రధాన కార్యదర్శి మల్లేష్, ఎంపీపీ విజయ్ కుమార్, ఎంపీడీఓ తిరుమల స్వామి,ఎంపీఓ రవీందర్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. ఆయా గ్రామల పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.