రెండవ రోజు పకడ్బందీగా పదవ తరగతి పరీక్షలు
స్టూడియో 10 టీవీ న్యూస్, ఏప్రిల్ 06, మహానంది:
మహానంది మండలం గాజులపల్లె గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మరియు క్రీస్తుజ్యోతి పాఠశాలలో గురువారం రెండవ రోజు పదో తరగతి హిందీ పబ్లిక్ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో ప్రారంభం అయ్యాయి.గ్రామంలో ఏర్పాటు చేసిన రెండు పరీక్షా కేంద్రాలైన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 165 మంది విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా 163 మంది విద్యార్థులు మాత్రమే హాజరయ్యారని, క్రీస్తుజ్యోతి పాఠశాలలో 151 మంది విద్యార్థులు పరీక్ష రాయాల్సి ఉండగా 144 మంది హాజరయ్యారని చీఫ్ సూపరింటెండెంట్స్ జి .మోహన్ రెడ్డి, ఎస్వి .రవణమ్మ తెలిపారు. ఉదయం 8 గంటల నుండే పరీక్షా కేంద్రాలకు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు చేరుకున్నారు. హాల్ టికెట్లను పరిశీలించిన అనంతరం పరీక్షా కేంద్రంలోనికి అనుమతించారు. వేసవి దష్ట్యా తాగునీరు అందుబాటులో ఉంచారు.పదవ తరగతి విద్యార్థిని, విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకుని వారికి కేటాయించిన సీట్లు చూసుకుని పరీక్ష సమయానికి ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు. పరీక్షల్లో ఎటువంటి మాల్ ప్రాక్టీసుకూ అవకాశం లేకుండా పరీక్షా కేంద్రాల్లోకి సెల్ ఫోన్స్, ఎలక్ట్రానిక్ వస్తువులను అనుమతించలేదు. పరీక్షా కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.