ఉద్యోగ విధినిర్వహణలో క్రమశిక్షణకు ప్రతిరూపం ఖజానా శాఖ అధికారి సాయిలు.
శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్*
స్టూడియో 10 టివి ప్రతినిధి సిల్వర్ రాజేష్ మెదక్ జిల్లా.
హైదరాబాద్ అసిస్టెంట్ సెక్రటరీ ఫైనాన్స్ గా పదోన్నతి పొందిన జిల్లా ఖజానా శాఖ అధికారి సాయిలు.
హైదరాబాద్ అసిస్టెంట్ సెక్రటరీ ఫైనాన్స్ గా పదోన్నతి పొందిన జిల్లా ఖజానా శాఖ అధికారి సాయిలు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ శుభాకాంక్షలు తెలిపారు.నూతన ఇన్చార్జి ఖజానా శాఖ అధికారి గా సత్య సోమేశ్వరరావు బాధ్యతలు స్వీకరించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విధి నిర్వహణలో క్రమశిక్షణ ఉన్నతాధికారి మన్ననలు పదోన్నతికి సోఫానాలు గా నిలుస్తాయని ఇదే స్ఫూర్తిగా పనిచేసి జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆకాంక్షించారు.
ఖజానా శాఖ అధికారి సాయిలు మాట్లాడుతూ మెదక్ లో 2021 నుండి నేటి వరకు ఖజానా శాఖ జిల్లా అధికారిగా బాధ్యతలు నిర్వహించానని ఈరోజు బదిలీపై హైదరాబాద్ లో అసిస్టెంట్ సెక్రటరీ ఫైనాన్స్ గా నియమింపబడ్డానని మెదక్ జిల్లాలో 2021 నుండి నేటి వరకు నాకు అన్నివిధాలుగా సహాయ సహకారాలు అందించిన గౌరవనీయులు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ కలెక్టరేట్ సిబ్బందికి అధికారులకు ఇతర శాఖాధిపతులకు జిల్లాలోని అన్ని శాఖల డీడీవోలకు ట్రెజరీ శాఖ లోని అధికారులు మరియు స్టాఫ్ అందరికీ కృతజ్ఞతలు.మెదక్ జిల్లా ట్రెజరీ అధికారిగా సేవలు అందించగలగడం సంతృప్తికరంగా ఉందన్నారు.