తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సీఎం కప్ 2024 రాష్ట్రస్థాయి పోటీలకు రంగం సిద్ధం మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్
స్టూడియో 10 టివి ప్రతినిధి సిల్వర్ రాజేష్ మెదక్ జిల్లా.
మెదక్ జిల్లా నుండి 365 మంది క్రీడాకారులు రాష్ట్రస్థాయికి ఎంపిక జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్
సీఎం కప్ 2024 రాష్ట్రస్థాయి పోటీలకు సర్వం సిద్ధం
డిసెంబర్ 27 నుండి జనవరి 2 వరకు జరగనున్న పోటీలు
రాష్ట్రస్థాయి క్రీడా పోటీలపై జిల్లా కలెక్టర్ గురువారం ఒక ప్రకటన విడుదల చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సీఎం కప్ 2024 రాష్ట్రస్థాయి పోటీలకు రంగం సిద్ధమవుతోంది అని తెలిపారు.
మొట్టమొదటిసారిగా గ్రామీణ స్థాయి నుండి నిర్వహిస్తున్న ఈపోటీలు గ్రామస్థాయి మండల స్థాయి మరియు జిల్లా స్థాయి పోటీలు పూర్తిచేసుకుని డిసెంబర్ 27 నుండి జనవరి 2 వరకు రాష్ట్రస్థాయి పోటీలు ఒక పండుగ వాతావరణం లో నిర్వహించుకోబోతున్నందుకు శుభపరిణామంగాపేర్కొన్నారు. రాష్ట్రస్థాయి సీఎం కప్ 2024 పోటీలలో భాగంగా మెదక్ నుండి యువతి యువకుల కబడ్డీ షటిల్ బ్యాడ్మింటన్ బాస్కెట్బాల్ ఫుట్బాల్ టేబుల్ టెన్నిస్ మరియు అత్య – పత్య క్రీడాకారులు గురువారం రాష్ట్రస్థాయి క్రీడలలో పాల్గొనడానికి పంపించడం జరిగిందని అన్నారు.వీరందరూ మహబూబ్నగర్ హైదరాబాద్ మరియు రంగారెడ్డి జిల్లాలలో జరిగే రాష్ట్ర పోటీలలో పాల్గొంటారని చెప్పారు.ఇప్పటికే ఆర్చరీ అథ్లెటిక్స ఆత్యాపాత్య బ్యాడ్మింటన్ బాస్కెట్బాల్ చెస్ సైక్లింగ్ ఫుట్బాల్ కబడ్డీ హ్యాండ్ బాల్ కరాటే ఖో-ఖో కిక్ బాక్సింగ్ ఉషు బాక్సింగ్ సేపక్ తక్ర సాఫ్ట్ బాల్ యోగ మరియు టేబుల్ టెన్నిస్ క్రీడలలో బాల బాలికలకు జిల్లా స్థాయి పోటీలు నిర్వహించి ఎంపిక చేయడం జరిగిందన్నారు.
అన్ని క్రీడలలో కలిపి మొత్తం 199 మంది బాలికలు 168 మంది బాలురు మొత్తం 367 మంది క్రీడాకారులను రాష్ట్రస్థాయికి పంపడం జరుగుతుందని వివరించారు. ఈరోజు జిల్లా నుండి కబడ్డీ క్రీడాకారులు 12 మంది బాలురు 12 మంది బాలికలు మొత్తం 24 మంది క్రీడాకారులతో కూడిన జిల్లా జట్టు తో పాటు 2 టీం మేనేజర్ మరియు కోచ్లు ఉన్నారని తెలిపారు.తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు వివరించారు.
తెలంగాణ గ్రామీణ క్రీడా రంగాన్ని బలోపేతంచేయాలన్న లక్ష్యంతో ముందుకు పోతున్నామన్నారు.మట్టిలో మాణిక్యాలను గుర్తించి వారి ప్రతిభకు ప్రోత్సాహం కల్పించాలన్న ఆశయంతో పనిచేస్తున్నామన్నారు. పల్లెల నుంచి ప్రపంచ ఛాంపియన్లను తీర్చిదిద్దాలన్న సంకల్పంతో పగడ్బందీగా ప్రణాళికలతో సిద్ధంగా ఉన్నామన్నారు.రాష్ట్రస్థాయిలో పాల్గొంటున్న దాదాపు రెండు లక్షల మంది కి పైగా క్రీడాకారుల సమాచారాన్ని గేమ్స్ మేనేజ్మెంట్ సిస్టం ద్వారా సంక్షిప్తం చేయడం, క్రీడాకారులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన సేవలు అందజేయడం క్రీడలకు ఆధునిక సాంకేతిక హంగులు సమకూర్చడం రాబోయే తరానికి దిక్సూచిలా తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ కృషి చేస్తోంది అని కలెక్టర్ వివరించారు. ఈ క్రీడల్లో పాల్గొని క్రీడాకారులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి అవుతున్నాయన్నారు.
వివక్షతకు తావు లేకుండా పారా క్రీడాంశాలో పోటీలు నిర్వహించుకోవడం ఈ సీఎం కపోటీలో మరో ప్రత్యేకత అన్నారు. ఒక యజ్ఞం లాగా నిర్వహిస్తున్న ఈ సీఎం కప్ 2024 విజయవంతం చేయడంలో యావత్తు తెలంగాణ క్రీడా సంఘాలు పీఈటీలు ఫిజికల్ డైరెక్టర్లు స్వచ్ఛంద సంస్థలు పలువురు క్రీడాభిమానులు పాలుపంచుకుంటున్నందుకు ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో యువజన క్రీడల నిర్వహణ అధికారి నాగరాజు వ్యాయామ ఉపాధ్యాయులు క్రీడాకారులు పాల్గొన్నారు.