స్టూడియో 10 టివి ప్రతినిధి సిల్వర్ రాజేష్ మెదక్ జిల్లా
దివ్యాంగులకు వారి వైకల్యాలను పరిగణలోకి తీసుకుని ప్రత్యేక వైద్య నిపుణులతో హెల్త్ క్యాంప్ ఏర్పాటుఫీజియోథెరపీ చికిత్సలు ద్వారా పకడ్బందీగా చర్యలు చేపడతామని కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. 65 దరఖాస్తులు స్వీకరణ. మంగళవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో గతంలో ఇచ్చిన ప్రకటన ఆధారంగా జరిగిన దివ్యాంగులు ప్రత్యేక ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అదనపు కలెక్టర్ నగేష్ డి.డబ్ల్యు.ఓ.హైమావతి డి.ఆర్.డి.ఓ శ్రీనివాసరావు మెప్మా పీడీ ఇందిర ఆర్టీసీ డిఎం సురేఖ ఎల్.డి.ఎం నరసింహమూర్తి తో కలసి కలెక్టర్ స్వయంగా వారి దగ్గరికి వెళ్లి దివ్యాంగులు సమస్యలను వింటూ డిఆర్డిఏ పిడి నోట్ చేసుకుంటూ వినతులు స్వీకరించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దివ్యాంగుల ప్రత్యేక ప్రజావాణికి విశేష స్పందన లభించిందని జిల్లాలో ఉన్న దివ్యాంగుల అందరూ విచ్చేసి వారి గోడు వెళ్లబుచ్చుకున్నారని ఈరోజు వివిధ సమస్యలపై 65 దరఖాస్తుల స్వీకరించిన జరిగిందని తెలిపారు. దివ్యాంగులు అధైర్య పడవద్దు పాలన యంత్రాంగం అండగా ఉంది మానవతాత దృక్పథంతో మీ సమస్యలను పరిష్కరించడానికి మేమున్నామని భరోసా కల్పించారు. దివ్యాంగులు ఎవరూ కూడా కార్యాలయాల చుట్టూ తిరగవద్దని మీ సమస్యలను పరిష్కరించి మీ మొబైల్ నెంబర్ ఆధారంగా చరవాణి కి సమాచారం తెలపడం జరుగుతుందని అన్నారు. ట్రై సైకిల్ కావాలని కొందరు ఉపాధి కొరకు కొందరు సదరం సర్టిఫికెట్ మంజూరు కొరకు డబల్ బెడ్ రూమ్ ఇండ్లు దరఖాస్తులు సమర్పించారని తెలిపారు.
దివ్యాంగులకు ఆర్టీసీ బస్సులలో వారికి కేటాయించిన సీట్లను వారిని కూర్చునే విధంగా చూడాలని ఆర్టీసీ బస్టాండ్లలో ప్రత్యేకంగా వికలాంగులు కూర్చోవడానికి సీటింగ్ ఏర్పాటు చేసేందుకు నిధులు మంజూరు చేస్తానని దానికి అనుగుణంగా చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ డిఎం సురేఖను ఆదేశించారు. దివ్యాంగుల ఆరోగ్య పరిస్థితిపై స్పందించి దానికి అనుగుణంగా ప్రత్యేక వైద్య నిపుణులతో హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రతి నెలలో రెండో మంగళవారం దివ్యాంగుల ప్రత్యేక ప్రజావాణి ఉంటుందన్నారు. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.దివ్యాంగుల అందించిన వివిధ సమస్యలను మానవతా దృక్పథంతో సకాలంలో పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని పరిష్కారం కాని సమస్యలపై క్షుణ్ణంగా వివరించాలన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ ఏవో యూనస్ డి.ఆర్.డి.ఏ సంక్షేమశాఖ కార్యాలయ సిబ్బంది జిల్లాలోని దివ్యాంగులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.